మామిడిలో యాజమాన్య పద్ధతులు పాటించాలి

ప్రజాశక్తి-రైల్వేకోడూరు మామిడి పూత పిందె, దశలో అధిక దిగుబడులు పొందడానికి సమగ్ర పోషక నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని అనంతరాజుపేట ఉద్యాన పరిశోధన స్థానం హెడ్‌, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ కెఎం.యువరాజు పేర్కొన్నారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి పి.రవిచంద్రబాబు అధ్యక్షతన రైల్వే మండలంలోని ఉద్యాన పరిశోధన స్థానం అనంతరాజుపేటలో మామిడి పూత, పిందె దశలో చేపట్టవలసిన సస్యరక్షణ, సమగ్ర యాజమాన్య పద్ధతులు, ఫ్రూట్‌ కవర్స్‌ వినియోగము, మార్కెటింగ్‌ పైన రైతు శిక్షణ, అవగాహన సదస్సునిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడవల్సిందిగా సూచించారు.ఉద్యాన కళాశాల అనంతరాజుపేట కీటక విభాగం సహాధ్యాపకులు డాక్టర్‌ జి.శారద మాట్లాడుతూ తేనె మంచు పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలని సూచించారు. ప్రారంభ దశలో తేనేమంచు పురుగు నివారణకు వేప నూనె 1500 పిపియం 5 మీ.లి లీటర్‌ నీటికి లేదా అజాడిరెక్టిన్‌ 10000 పిపిఎం 1 ఎం.ఎల్‌ం జిగురు మందు 0.5 మీ.లి లీటర్‌ కలిపి పిచికారి చేయాలన్నారు. పచ్చి పూత దశలో నివారణకు బుఫ్రోపూజిన్‌ 20 శాతం, అసిపేట్‌ 50 శాతం, 1గ్రాము లేదా డైనోటోఫ్యూరాన్‌ 0.2 గ్రాములు లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. బిఎంవి అనే మైక్రోబియల్‌ మందును ఎకరాకు 100మి.లీ 500 లీటర్ల నీటిలో కలిపి డ్రిప్‌లో వదలాలని తెలి పారు. ఇప్పుడు పిందెలు రాలుతున్నట్లు అనిపిస్తే ప్లానోఫిక్స్‌ అనే మందును 500 లీటర్ల నీటికి 100 మి.లి కలిపి స్ప్రే చెయాలని తెలిపారు. తామర పురుగులు నివారణకు నీలి రంగు జిగురు అట్టలను చెట్టుకు ఒకటి చొప్పున కట్టాలి, కానుగ సోప్‌ ను 7.5 గ్రాములు లీటర్‌ నీటికి కలిపి స్ప్రే చెయ్యాలన్నారు. ఒకవేళ తామర పురుగులు ఉదతి అధికంగా ఉంటే ఫిప్రోనేల్‌ 2 మి.లీ లేదా స్పైనోసాడ్‌ 0.3 మి.లీ కలిపి పిచకారి తెలిపారు.ఎట్టి పరిస్థితులలో సింథటిక్‌ పైరిత్రోయిడ్స్‌ మందులను మామిడిలో వాడకూడన్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవి చంద్రబాబు మాట్లాడుతూ ఉద్యాన శాఖ తరపున మామిడి కాయలకి ఉపయోగించే కవర్లు సబ్సిడీలో ఆదిస్తున్నామని చెప్పారు. అన్నారు. కావలసిన రైతులు మీ దగ్గరలోని రైతు సేవ కేంద్రాలలో నమోదు చేసుకొని పొందవచ్చు అన్నారు.ఒక్కొక్క కవర్‌ ధర రూ.2.20, ఇందులో సబ్సిడీ రూ.1, రైతు భాగంగా రూ.1.20 చెల్లించి పొందవచ్చునని అన్నారు. ఉద్యాన పరిశోధన స్థానం, అనంతరాజుపేట తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్‌ జి. సందీప్‌ నాయక్‌ మామిడిలో బూడిద తెగులు,పక్షి కన్ను తెగులు, ఇతర తెగులు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలిపారు కార్యక్రమంలో కోడూరు, రాజంపేట ఉద్యాన అధికారులు యం. వెంకట భాస్కర్‌, జి.సురేష్‌ బాబు, కోడూరు వ్యవసాయ అధికారి సుధాకర్‌,రైతు సేవ కేంద్ర సిబ్బంది, కోడూరు రాజంపేట నియోజకవర్గాల్లోని ఏడు మండలాల నుంచి 310 మంది మామిడి రైతులు పాల్గొన్నారు.

➡️