సమయస్ఫూర్తితో అగ్ని ప్రమాదాలు నివారించాలి

ప్రజాశక్తి-కనిగిరి: జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మంగళవారం కని గిరి అగ్నిమాపక సిబ్బంది పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ మరియు గ్యారేజ్‌ లో అవగాహన కార్యక్రమం నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని కాశిరెడ్డి కాలనీ, చింతలపాలెం ఎస్సీ కాలనీలో ప్రజలకు గ్యాస్‌, ఎలక్ట్రికల్‌, అయిల్‌, ప్రమాదాలు, తీసుకోవాల్సి న జాగ్రత్తలు గురించి డెమో నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి అగ్నిమాపక కేంద్రాధికారి సిహెచ్‌ బంగారు బాబు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆందోళన చెందకుండా సమయస్ఫూర్తి తో ప్రమాదాలను నివారించాలని తెలిపారు. ప్రమాదాలు చోట్ను చేసు కున్న వెంటనే అగ్నిమాపక కేంద్రానికి తెలియచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఎండి షయానాబేగం, ఆర్‌టిసి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.దర్శి: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆర్టీసీ బ స్టాండ్‌లో ప్రయాణికులకు, సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణపై అవ గాహన కల్పించారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేశారు. అక్కడ నుంచి శివశంకర్‌ సినిమా థియేటర్‌ వద్దకు వెళ్లి అక్కడ సిబ్బందికి మరి యు ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. స్మార్ట్‌మాల్స్‌ లో సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రాధికారి సిహెచ్‌.జాలయ్య ఆధ్వర్యంలో సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

➡️