లేఅవుట్ల క్రమబద్ధీకరణలో నిబంధనలు పాటించాలి

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: లే అవుట్ల క్రమబద్ధీకరణలో నిబంధనలు పాటించాలని బాపట్ల జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీక్షణ సమావేశ మందిరంలో బాపట్ల మున్సిపాలిటీ మరియు బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలోని అక్రమ లే అవుట్‌లపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్‌ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ, బాపట్ల అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ చైర్మన్‌ సలగల రాజేష్‌ బాబు పాల్గొన్నారు. 2019 నుంచి మున్సి పాలిటీ మరియు అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ పరిధిలోని అక్రమ లే అవుట్లను గుర్తించి వివరాలు తెలపాలని ప్రభు త్వం ఆదేశించిందని దానికి సంబంధించి మున్సిపాలిటీ, బావుడా పరిధిలోని తొమ్మిది మండలాలలో మొత్తం 183 లేఅవుట్లను గుర్తించి వాటి వివరాలను డిటిసిపికి పంపిం చడం జరిగిందని, వివరాలను పత్రికలలో ప్రచురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని అధికారులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు. అందులో 86 లే అవుట్లను 22ఎ కింద గుర్తించి రిజిస్ట్రేషన్‌ కాకుండా చర్యలు తీసుకో వాలని కమిషనర్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌కు పంపామని మిగిలిన లే అవుట్లను సబ్‌ డివిజన్లుగా చేసి పంపాలని వా టిని తిప్పి పంపారని వారు కలెక్టర్‌కు వివరించారు. 183 లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సాధ్యాసాధ్యాలపై జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆరా తీశారు. కొత్త లేఅవుట్ల అనుమతులకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ల్యాండ్‌ కన్వర్షన్‌ కు, ఇంటి నిర్మాణాలకు సంబంధించి మునిసిపాలిటీ, బావు డా, పంచాయతీ పరిధిలోని నిబంధనలను ప్రజలకు అర్థమ య్యే విధంగా తయారు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. లేఅవుట్ల క్రమబద్ధీకరణ ఆలస్యం అవుతుం దని, తద్వారా ప్రభుత్వానికి వచ్చే రాబడి తగ్గుతుందని, బాపట్ల అభివద్ధికి ఆటంకం కలుగుతుందని, వాటిని వీలైనంత త్వరలో నిబంధనల మేరకు క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా రెవెన్యూ అధికారి డి గంగాధర్‌ గౌడ్‌, డీపీవో ప్రభాకర్‌, బాపట్ల రెవెన్యూ డివిజనల్‌ అధికారి పి.గ్లోరియా, బాపట్ల మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి, బావుడా ప్లానింగ్‌ అధికారి షేక్‌ ఖలీషా తదితరులు పాల్గొన్నారు.

➡️