ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలోని స్కౌట్ మాస్టర్‌లకు, గైడ్ కెప్టెన్‌లకు నిర్వహించిన బేసిక్, అడ్వా న్సుడ్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లు స్కౌట్ జిల్లా సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి తెలిపారు.ఆదివారం గాలివీడు రోడ్డు మార్గాన ఉన్న అర్చన కళాశాలలో ఈనెల 2 నుంచి 8 వరకు ఏడు రోజులపాటు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో బేసిక్ శిక్షణకు 100 మంది, అడ్వాన్సుడ్ శిక్షణకు పది మంది స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు హాజర య్యారన్నారు. ఈ శిక్షణలో రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొని పకతి వైపరీత్యాలు సంభ వించినప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, పాఠశాలల్లో విద్యార్థులకు ఎటువంటి అంశాలలో ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి, నైతిక విలువలు, మానవతా విలువలు, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, సేవా భావం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్ర మంలో అర్చన కళాశాల కరస్పాండెంట్ పాపిరెడ్డి మదన్ మోహన్‌రెడ్డి, ప్రిన్సిపల్ మౌలాలి, కళాశాల డైరెక్టర్ లక్ష్మి, అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ లక్ష్మీకర, ట్రెజరర్ మార్ల ఓబుల్‌రెడ్డి, ఎల్‌ఒసిలు జి.వెంకటేశ్వర్లు, శకుంతలమ్మ, శంకరమ్మ, ఎఎల్‌టిలు శివప్రసాద్, నాగరాజగుప్తా, ఫ్రీ ఎల్‌టి నాగరాజ, ఆఫీసు అసిస్టెంట్ చినబాబు, రెండు జిల్లాల స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు పాల్గొన్నారు.