ప్రజాశక్తి – కొమరాడ : జీడి ప్రాసెసింగ్ సెంటర్లు వెంటనే ఏర్పాటు చేయాలని, గిరిజన గ్రామాల్లో ఉన్న అనేక సమస్యలు పరిష్కారం చేయాలని ఎపి ఆదివాసి గిరిజన సంఘం నాయకులు హెచ్.రామారావు అన్నారు. ఈనెల 17, 18 తేదీల్లో ఐటిడిఎ వద్ద 48 గంటల ధర్నా జయప్రదం చేయాలని కోరుతూ ధర్నాకు సంబంధించిన కడపత్రాలు పంచుతూ శనివారం కోనవలస, పెళ్లిగుడ్డి, తమ్మన్నదొరవలస, డంగభద్ర, నందాపురం గ్రామాల్లో ప్రచారం చేశారు. కార్యక్రమంలో రామారావు మాట్లాడుతూ గుమ్మలక్ష్మీపురం, సాలూరు మండలాల్లో జీడి పిక్కల ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేసి గిరిజను పండించిన జీడి పంటతో పాటు ఇతర పంటలకు గిట్టు ధర కల్పించేలా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూము లకు పట్టాలివ్వాలని కోరారు. నిరుపేదలకు ఇళ్ల స్థలంతో పాటు ఇళ్లు ఇవ్వాలని ఈ విధంగా గిరిజనులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి అన్ని విధాలా భరోసా కల్పించాలని కోరుతూ ఈనెల 17, 18 తేదీల్లో 48 గంటల పాటు పార్వతీపురం ఐటిడిఎ వద్ద చేపట్టనున్న ధర్నాలో గిరిజనులంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అలాగే కొత్తవలసలో గిరిజన రైతుల జీడి తోట కాలిపోయిన సందర్భంగా పరిశీలించి నష్ట పరిహారం ఇవ్వాలని, గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన రైతులు, మహిళలు పాల్గొన్నారు.సాలూరురూరల్ : జీడి పంటకు మద్దతు ధరలు ఇవ్వాలని, ప్రభుత్వం జీడి ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17 18 తేదీల్లో ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరిగే ఐటిడిఎ ధర్నాలో గిరిజన రైతులంతా పాల్గొని జయప్రదం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి గెమ్మెల జానకిరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మండలంలోని జిల్లేడువలసలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా నాయకులు ఎన్‌వై నాయుడు, గిరిజన రైతులు కూనేటి సుబ్బయ్య, గెమ్మెల మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం :జీడి పిక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జీడి మామిడి రైతుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మండలంలోని ఇరిడి సచివాలయం వ్యవసాయ శాఖ అధికారికి వినతిని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు పువ్వల ప్రసాద్ ఆరిక నవీన్, జల్లి సతీష్, జీడి మామిడి రైతుల బీ.రామ్మూర్తి, సత్తిమ్మ, సుశీల, రాధ తదితరులు పాల్గొన్నారు.రైతు సేవా కేంద్రాల ద్వారా జీడిపిక్కలు కొనుగోలు చేయాలి సీతానగరం: జీడి పిక్కలను రైతు సేవా కేంద్రాల ద్వారా 80 కేజీల బస్తా రూ.16 వేలకు రూపాయలకు కొనుగోలు చేయాలని రైతు సంఘం నాయకులు స్థానిక తహశీల్దార్‌కు శనివారం వినతిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల నుండి జీడిపిక్కలు కొనకుండా వ్యాపారుల దయాదాక్షిన్యా లకు వదిలేసిందన్నారు. ఫలితంగా గిరిజనులు దోపిడీకి గురవుతున్నా రన్నారు. కావున రైతు సేవా కేంద్రాల ద్వారా 80 కేజీల జీడిపిక్కల బస్తా రూ.16వేలకు కొనుగోలు చేయాలని కోరారు. వినతిని అందజేసిన వారిలో రైతు సంఘం నాయకులు బొరపరెడ్డి అప్పారావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రెడ్డి ఈశ్వరరావు, చందనపల్లి కృష్ణ, జి. వెంకటరమణ పాల్గొన్నారు.
