భగత్‌ సింగ్‌ కాలనీలో నాకాబంది

May 25,2024 10:31 #Bhagat Singh Colony, #Nagabandi

ప్రజాశక్తి-పుంగనూరు (చిత్తూరు) : పుంగనూరు మున్సిపాలిటీ పరిధి భగత్‌ సింగ్‌ కాలనీలో పోలీసులు నాకబంది నిర్వహించి రికార్డు లేని ఆరు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ రాఘవరెడ్డి తెలిపారు. ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా … అర్బన్‌ సీఐ ఆధ్వర్యంలో శనివారం నాకాబంది నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల పలు ఇళ్ళల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రాఘవరెడ్డి మాట్లాడుతూ … అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ సర్కిల్‌ పరిధిలో ఎన్నికల కౌంటింగ్‌ అనంతరం ఎక్కడ గొడవలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ఎస్పి మణికంఠ చందోలు ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు, అనుమానాస్పద ఇండ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగ భగత్‌ సింగ్‌ కాలనీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ, నాకాబంది చేపట్టామన్నారు. కాలనీలో అనుమానాస్పద వ్యక్తుల ఇండ్లలో తనిఖీలు చేపట్టి మాదకద్రవ్యాలు, అక్రమ రవాణా వస్తువులు గురించి, వాహనాలను తనిఖీలు చేసి, సరైన రికార్డ్స్‌ లేని 6 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కొత్త గా సవరించిన మోటార్‌ వెహికల్‌ చట్టం లోని పెంచిన పరిమాణాల గురించి తెలియజేస్తూ, వార్డు, కాలనీ లో ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించి ఆ తర్వాత కాలనీవాసులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకూడదని హెచ్చరిస్తూ, ఎన్నికల నియమావళి, సెక్షన్‌ 144 సి ఆర్‌ పి సి అమలులో ఉన్నదని, నియమావళిని పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏస్‌.ఐ సుబ్బారెడ్డి, మహమ్మద్‌ రఫీ , 20 మంది సిబ్బంది పాల్గొన్నారు.

➡️