ఐసీడీఎస్‌ పీడీగా నాగమణి – బాధ్యతల స్వీకరణ

Mar 10,2025 16:10 #charge, #ICDS PD, #Nagamani assumes

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : అనంతపురం జిల్లా ఐసీడీఎస్‌ పీడీగా నాగమణి సోమవారం బాధ్యతలు చేపట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయం సీడీపీఓగా పని చేసిన ఆమె.. ఏపీడీగా పదోన్నతి లభించింది. అనంతపురం ఐసీడీఎస్‌ రెగ్యులర్‌ పీడీగా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆమె సోమవారం బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించగా.. ఆమెకు కలెక్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఐసీడీఎస్‌ జిల్లా కార్యాలయంలోని తన ఛాంబర్‌ కు వచ్చారు. ఆమెను సీనియర్‌ అసిస్టెంట్లు ధనలక్ష్మి, బాబా నూరుద్దీన్‌, డీసీపీఓ మంజునాథ్‌, సోషల్‌ కౌన్సిలర్లు వెంకట్‌, రమాదేవి, డీవీసీ లీగల్‌ కౌన్సిలర్‌ నర్మద, డీఈఓ గీత పీడీని మర్యాద పూర్వకంగా కలిశారు. బకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.

➡️