రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తా : నాగార్జున

Apr 17,2024 21:57

 ప్రజాశక్తి- చీపురుపల్లి : నా నిర్ణయాన్ని రెండు రోజుల్లో వెల్లడిస్తానని తాను ఏం చేయాలన్నదానిపై కార్యకర్తలు, అబిమా నులతో మాట్లాడేందుకు వచ్చానని, వారి అభీష్టం మేరకు తన నిర్ణయం ఉంటుం దని చీపురపల్లి నియోజకవర్గ ఇంఛార్జి కిమిడి నాగార్జున అన్నారు. బుధవారం చీపురుపల్లిలో ఉన్న ఆయన నివాశానికి వచ్చారు. అధిష్టానం ఆయనకు టిక్కెట్టును నిరాకరించడంతో ఇంత వరకు ఆయన చీపురుపల్లి రాలేదు. శ్రీరామనవమిని పురష్కరించుకొని తన అభిమానులు నవమి వేడుకలలో పాల్గొనాలని కోరడంతో బుదవారం ఆయన చీపురుపల్లి వచ్చారు. ఈ సందర్బంగా ఆయన నివాశంలో కార్యకర్తలు, అభిమానులతో కలసి మాట్లాడారు. భవిష్యత్‌ నిర్ణయం రెండు మూడు రోజుల్లో తీసుకుంటానని కార్య కర్తలందరి అభీష్టమే తన నిర్ణయమని స్పష్టం చేశారు. అనంతరం నాగార్జునుని కలిసేందుకు నాలుగు మండలాల నుండి అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చీపురుపల్లి వచ్చారు. అనంతరం అభిమా నులు, కార్యకర్తలతో కలసి కనకమహలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెల్లి ప్రత్యేక పూజలను చేశారు. నాగార్జున నివాసం నుండి అభిమానులు, కార్యకర్తలు భారీ బైక్‌ ర్యాలీతో అమ్మవారి గుడికి తీసుకు వెల్లారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ నాగార్జున నిర్ణయమే తమ నిర్ణయమని నాగార్జున ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే నడుస్తామని అన్నారు.

➡️