షాట్‌ పుట్‌ పోటీల్లో రాష్ట్రస్థాయికి నాగిరెడ్డి పల్లె విద్యార్థి ఎంపిక

Sep 30,2024 17:03

ప్రజాశక్తి – నందలూరు (కడప) : ఇటీవల ఉమ్మడి కడప జిల్లా స్థాయిలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌. జి. ఎఫ్‌.) ఆధ్వర్యంలో జరిగిన షాట్‌ పుట్‌ పోటీల్లో మండలంలోని నాగిరెడ్డి పల్లె ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి సయ్యద్‌ ఉమర్‌ ఉస్మాన్‌ అలీ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కడపలో జరిగిన పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థుల్లో ఉమర్‌ ఉస్మాన్‌ అలీ రెండవ స్థానంలో నిలిచారు. ఇందుకోసమై పాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుని గౌరీ చేసిన కృషి అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయలలిత కుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయుని గౌరీని రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థి ఉమర్‌ ఉస్మాన్‌ అలీని సోమవారం ఉదయం ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఖాదర్‌ బాషా, గంగనపల్లి వెంకటరమణ, సుబ్బరాయుడు, విజయ కుమారి, తులసి స్వర్ణలత, రమణమ్మ, జ్యోతి ప్రియ తదితరులు పాల్గొని సత్కరించారు.

➡️