ప్రజాశక్తి – విజయనగరం కోట : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ వ్యాపారం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా గండ్రేటి సత్యనారాయణ నియమితులైన సందర్భంగా శుక్రవారం నాడు మర్యాదపూర్వకంగా రాష్ట్ర శిశు సంక్షేమ , గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలిశారు. ముందుగా ఆమెకు సత్యనారాయణ పుష్పగుచ్చమిచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం ఆమెతో నాయి బ్రాహ్మణుల ఎదుర్కొంటున్న సమస్యలను అదేవిధంగా వారి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీకు ఎటువంటి సమస్యలు ఎదురైన మా దృష్టికి తీసుకురావాలని కోరారు. గండ్రేటి సత్యనారాయణతోపాటు అరకు పార్లమెంట్ నాయి బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వీనర్ దాల్ల వలస శ్రీనివాసరావు, పార్వతపురం మన్యం జిల్లా అధ్యక్షులు శంకర్రావు, విజయనగరం జిల్లా గౌరవ అధ్యక్షులు సింహాచలం, పార్వతపురం మన్యం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రవణ, సాలూరు టౌన్ ప్రెసిడెంట్ కొయ్యల శ్రీను, బాడంగి పాచిపెంట సాలూరు మండల ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు.