నల్లయిపల్లె ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి : వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా

అట్లూరు (కడప) : అట్లూరు మండల పరిధిలోని నల్లాయపల్లె రెవెన్యూ పొలం సర్వేనెంబర్‌ 40 లో 445 ఎకరాల ప్రభుత్వ భూములు స్థానిక పేదలకు భూ పంపిణీ చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అన్వేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు బుధవారం ఉదయం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అట్లూరు తాసిల్దార్‌ కార్యాలయం ఎదుట నల్లాయపల్లె రెవెన్యూ పొలంలో కమలకూరు బీసీ కాలనీ కమలాకూరు వలసపాలెం దేవానగర్‌ అట్లూరు కొండూరు గ్రామాల పేదలకు ప్రభుత్వ భూములు ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వలసలు నివారించడానికి ప్రభుత్వం భూ పంపిణీ చేపట్టాలన్నారు కానీ గత ప్రభుత్వాలు పేదలకు భూ పంపిణీ అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయటం వల్లనే వైసీపీ ప్రభుత్వాన్ని గ్రామీణ పేదలు ఇంటికి సాగనంపారు నూతన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూకబ్జాలపైన శ్వేత పత్రం విడుదల చేసి వదిలేయకుండా భూ కబ్జాల వద్ద ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు ప్రభుత్వం భూ సీలింగ్‌ యాక్ట్‌ అమలు చేయాలన్నారు అప్పుడే ప్రభుత్వ భూములను అన్యక్రాంతం కాకుండా అరికట్టచ్చు అన్నారు అట్లూరు మండల పరిధిలోని నల్లాయ పల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్‌ 40లో కమలాకూరు వలస పాలెం కాటమార పల్లె దిన్నెమీద పల్లె తదితర గ్రామాల పేదలకు పట్టాలు రెవెన్యూ యంత్రాంగం ఇచ్చినారు ఆ భూములు ఏండ్ల తరబడి భూములకు సర్వే చేసి లబ్ధిదారులకు చూపించడం లేదు కనుక ఇదే అదునుగా స్థానికేతర్లు రాజకీయ పలుకుబడి కలిగిన వారు పెద్ద ఎత్తున భూములు ఆక్రమించి జామాలీ పండ్లతోటలు తదితర పంటలు సాగు చేస్తున్నారు ఆ భూములను రెవెన్యూ యంత్రాంగం వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు అదేవిధంగా దొంగ పాసుబుక్కులు నకిలీ పట్టాలు వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు అసైన్డ్‌ చట్టపకారం పేదలకు ఇచ్చిన భూములకు మాత్రమే సర్వే చేసి భూములు అప్పజెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో అట్లూరు మండలం వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దుర్గమ్మ రమణయ్య సుభద్రమ్మ మాధవి పార్వతి పాపలమ్మ గుర్రమ్మ వెంకటసుబ్బయ్య బి గంగయ్య రవిచంద్ర సుమంత్‌ తదితరులు పాల్గన్నారు అనంతరం అట్లూరు మండల డిప్యూటీ తాసిల్దారు రవిశంకర్‌ కు వినతి పత్రం సమర్పించారు.

➡️