నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు

ప్రజాశక్తి -మద్దిపాడు : స్థానిక టిడిపి కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు మండవ జయంత్‌ బాబు ఆధ్వర్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జయంత్‌ బాబు మాట్లాడుతూ బాలకష్ణ సినీ రంగంలో రాణిస్తూనే ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మన్నలు పొందుతున్నారన్నారు. ఈ కార్యక్ర ములో క్లస్టర్‌ ఇన్‌ఛార్జులు దేవభక్తుని ప్రసాద రావు, పాటిబండ్ల అజరు కుమార్‌, యూనిట్‌ ఇన్‌ఛార్జి మల్లిపెద్ది బాలకష్ణ , సుద్దపల్లి అనిల్‌, సుద్దపల్లి నరసింహా, భానుచందర్‌, మండవ గోవిందరాజులు, కోడూరి ప్రసాద్‌, మందపల్లి శ్రీనివాసరావు, మొనపాటి రామకష్ణ , రావి నరసింహారావు, రావి వర ప్రసాద్‌, స్వయంపు శ్రీనివాసరావు, పోకూరి శ్రీనివాసరావు, రామాంజనేయలు, రావి శేషయ్య, ఆర్ల శివరాం, తాతపూడి నాగరాజు, దాసరి అక్కయ్య , ఎద్దు రాంబాబు, గడ్డం రవి సిఎస్‌.పురం : స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు బి.వెంగయ్య, ఎన్‌సి. మాలకొండయ్య, మన్నెపల్లి శ్రీనివాసులు, సిఎస్‌.పురం సర్పంచి శ్రీరాం పద్మావతి, రామకష్ణంరాజు, వెంకటకొండయ్య, మాల్యాద్రి, లక్ష్మీ పాల్గొన్నారు. దర్శి : స్థానిక టిడిపి కార్యాలయంలో హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకష్ణ 64 జన్మదిన వేడుకలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, బాలకష్ణ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుర్రం బాలకష్ణ, దానం సుబ్బారావు, సుబ్బు పాల్గొన్నారు. అనంతరం శిరిడీ సాయిబాబా వద్ధాశ్రమంలో వద్ధులకు అన్నదానం నిర్వహించారు. సిఎస్‌ పురంరూరల్‌ : మండల పరిధిలోని కంభంపాడు గ్రామంలో హిందూపురం మ్మెల్యే నందమూరి బాలకష్ణ జన్మదిన వేడుకలను సోమవారం నిర్వహించారు. కోవిలంపాడు గ్రామ టిడదిపి అధ్యక్షుడు షేక్‌ నాయబ్‌ రసూల్‌, ఒంగోలు పార్లమెంటు తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్‌ రజ్జబ్‌ బాషా ఆధ్వర్యంలో ముస్లిం మహిళలు కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఖలీల్‌, రావుల సూరి, నాయబ్‌ రసూల్‌, ఖాదర్‌ బాషా, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️