ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్ : పల్నాడు జిల్లా వినుకొండలో ఇటీవల జరిగిన 68వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ -17 ఫుట్‌బాల్ పోటీల్లో సత్తెనపల్లి మండలం నందిగామ జెడ్‌పి పాఠశాల 10వ తరగతి విద్యార్థి పోసిపోగు నవీన్ ప్రతిభ చూపాడు. నవీన్, పోట్లూరి తేజ (గోల్ కీపర్) జిల్లా జట్టులో ఆడి పల్నాడు జిల్లా జట్టు తృతీయ స్థానం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో నవీన్‌ను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. త్వరలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో నవీన్ ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. నవీన్‌ను పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎన్.సురేష్ కుమార్, హెచ్‌ఎం కె.శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అభినందించారు.