నందిగామ గ్రామీణం (ఎన్‌టిఆర్) : మండలంలోని కొణతమాత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ద్వారా సహకార సంఘ పరిధిలోని, కొణతమాత్మకూరు, దామలూరు,సోమవరం, రుద్రవరం, తొర్రగుడిపాడు, రామిరెడ్డిపల్లి, జన్నలగడ్డ, పల్లగిరి, గ్రామాలలో రైతు సేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. కొణతమాత్మకూరు గ్రామంలో రైతు సేవ కేంద్రం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ, మండల తెలుగు దేశం పార్టీ నాయకులతో కలిసి వీరాస్వామిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరాస్వామిన్ మాట్లాడుతూ … కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన ఆరు నెలలు కూడా డబ్బులు ఇవ్వకపోతే రైతులు ఎంతో ఇబ్బందులు పడ్డారని ప్రతిపక్షంలో ఉండగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఈ యొక్క వాస్తవాలను గమనించి ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో క్వింటాళ్ళకు 2300 రూపాయలు డబ్బులు చెల్లిస్తుందని అంతేగాక హమాలీల కూలి సంచులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తూ మిల్లు దూరాన్ని బట్టి కిరాయిలు కూడా చెల్లిస్తుందని రైతులందరూ ఈ వాస్తవాన్ని గమనించి రైతు సేవా కేంద్రాల ద్వారానే ధాన్యాన్ని విక్రయించుకోవాలని దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తోట నాగమల్లేశ్వరరావు (బుజ్జి), దిశా కమిటీ సభ్యురాలు మన్నే కళావతి, కాశీం, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తాసిల్దార్, జవాజి భాస్కరరావు, మన్నేపల్లి వినరు,కేశగాని వెంకటేశ్వర్లు (వెంకన్న), సర్పంచులు గాదెల రామారావు, మెడా కోటేశ్వరరావు, జవ్వాజి ప్రదీప్,వేజెండ్ల అప్పారావు, చల్లా తులసిరావు, కొంకపాక వెంకట నరసయ్య, చింతోటి సాంబశివరావు, నేలవెల్లి సిద్ధార్థ, పిఎసిఎస్ కార్యదర్శి నెల్లూరి నరసింహారావు, హమాలీలు ముళ్ళపాటి కొండ,రుద్రపోగు శ్రీను,మారేపోగు సంగమేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నందిగామ టిడిపి నేత వీరంకి వీరస్వామిన్
