ఆరోగ్య సురక్షను సద్వినియోగం చేసుకోవాలి

Feb 13,2024 20:00

జగనన్న ఆరోగ్య సురక్ష జగనన్న ఆరోగ్య సురక్ష ఆరోగ్య శిబిరాన్ని పరిశీలిస్తున్న జిల్లా వైద్యాధికారి వెంకటరమణ

ఆరోగ్య సురక్షను సద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా వైద్య అధికారి డాక్టర్‌ వెంకటరమణ
ప్రజాశక్తి – బనగానపల్లె
జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య అధికారి డాక్టర్‌ వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని కైప గ్రామంలో టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శివశంకరుడు ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష ఫేస్‌-2 వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిపి, షుగరు, గుండె జబ్బులు, రక్తహీనత, కంటి తదతర వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ జగదీశ్వర్‌ రెడ్డి, యుఆర్‌డి ప్రసాద్‌, ఎంబిహెచ్‌ఈఓ వెంకటేశ్వర్లు, గ్రామపంచాయతీ ఈవో ఖలీల్‌, వైసిపి నాయకులు మోదుల్లా, ప్రతాపరెడ్డి, ఎంపిహెచ్‌ఇఒ వెంకటేశ్వర్లు, ఆరోగ్య సిబ్బంది, సూపర్వైజర్‌, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు

➡️