ఆళ్లగడ్డలో గూండా రాజ్యం

Feb 12,2024 19:51

1. పార్టీలో చేరిన వారితో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డలో గూండా రాజ్యం

– గొడగనూరులో వైసీపీకి భారీ షాక్‌ు

-సుమారు 50 కి పైగా కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలో చేరిక

ప్రజాశక్తి -చాగలమర్రి

ఆళ్లగడ్డ తాలూకాలో గుండా రాజ్యం నడుస్తుందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. సోమవారం మండలంలోని గొడిగెనూరు గ్రామంలో వైఎస్‌ఆర్సిపికి భారీ షాక్‌ తగిలింది. గ్రామంలో వైసీపీ నుండి 50 కుటుంబాలు టిడిపిలో చేరాయి. గ్రామానికి చెందిన సూర్యనారాయణ, చిన్న నరసింహులు, పెద్ద అంకాలు, చిన్న అంకాలు, బాలకృష్ణ, సంతోష్‌,వెంకటసుబ్బయ్య లతోపాటు మరో 47 కుటుంబ సభ్యులను భూమా అఖిలప్రియ టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు చనిపోయిన తర్వాత రాజకీయాలపై ఆసక్తి రాజకీయాలు చేస్తానన్న నమ్మకం గొడిగినూరు గ్రామం నుంచే వచ్చిందని గర్వంగా చెబుతామన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో ఏనాడైనా మాట్లాడరా అని ప్రశ్నించారు. కేవలం దోచు కోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ఈరోజు ఆళ్లగడ్డలో పండగ వాతావరణం కనిపిస్తుందని మా పై నమ్మకంతో ఎక్కడ చూసినా వైఎస్‌ ఆర్సిపి నుండి టిడిపిలోకి వలసలు వస్తున్నారన్నారు. భూమా కుటుంబంలోకి వచ్చిన వారందరికీ తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికా రంలోకి వస్తేనే గ్రామాలు బాగుపడతాయని సర్పంచులు కూడా తలెత్తుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతి చేసిన నాయకుల భరతం పడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువనాయకులు భార్గవరామ్‌,భూమ జగత్‌ విఖ్యాత్‌రెడ్డి, మండల కన్వీనర్‌ నరసింహారెడ్డి, కొలిమి హుస్సేన్‌ వలి, కొలిమిమాబుషరీఫ్‌, ముల్లా అజీమ్‌ , ముల్లా గఫార్‌, సల్లా నాగరాజు, కొలిమి షబ్బీర్‌, ఆలంశ గారి ఖలీల్‌, కొలిమి సోను, దేశం రెడ్డి, ప్రతాప్‌ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, అబ్దుల్లా , నరసింహారెడ్డితదితరులు పాల్గొన్నారు.

➡️