గత చంద్రబాబు ప్రభుత్వం హామీలకు పరిమితమైంది

Feb 11,2024 17:13

డ్వాక్రా గ్రూపులకు వైయస్సార్ ఆసరా మెగా చెక్కులు అందజేస్తున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

గత చంద్రబాబు ప్రభుత్వం హామీలకు పరిమితమైంది
శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
ప్రజాశక్తి – పగిడ్యాల
గత చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం హామీలు ఇచ్చి ప్రలోభాలు పెట్టి హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందిందని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విమర్శించారు. వైయస్సార్ ఆసరా సంబరాల్లో భాగంగా ఆదివారం మండల కేంద్రం పగిడ్యాలలో బహిరంగ సభలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పసుపు కుంకుమ పేరుతో మహిళలను ఎంతగా మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు ఓటమి భయంతోనే జనసేనతో బిజెపితో పొత్తులు పెట్టుకున్నందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి మన రాష్ట్ర భవిష్యత్తును మన పిల్లల భవిష్యత్తును కాంగ్రెస్ నాశనం చేసిందని ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనుల గురించి వాస్తవాలు మాట్లాడితే ప్రతిపక్ష పార్టీలు అవాస్తవాన్ని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ వచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలను ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్మించారన్నారు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం అవసరం ఉన్నా ఏ పనులు చేయించుకున్నాలన్న జన్మభూమి కమిటీ సభ్యులు సంతకం చేస్తేనే పని జరిగేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అలాంటి ఇబ్బందులు పెట్టకుండా సచివాలయాలను వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి నేరుగా ప్రజా సంక్షేమ పథకాలను వారి ఇంటి వద్దకే వచ్చి విధంగా ఏర్పాటు చేశారని అన్నారు. జగన్ గురించి ఆలోచన చేస్తే సచివాలయాలు రైతుబరస కేంద్రాలు ఇండ్ల నిర్మాణాలు అమ్మబడి ఇలాంటి ఎన్నో పథకాలు గుర్తుకొస్తాయని అదే చంద్రబాబు గురించి ఆలోచిస్తే ఎన్టి రామారావుకు వెన్నుపోటు పొడవడం నీరు చెట్టు కింద తూచుకోవడం ఫ్యాషన్ ప్రోత్సహించడం గుర్తుకొస్తాయన్నారు. కేవలం పేద ప్రజలను మహిళలను నమ్ముకుని వారి అభివృద్ధి కోసం వారి పిల్లల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి జగనన్న పాటు పడారన్నారు. ఇక్కడున్న కొందరు నాయకులు గతంలో తిట్టుకున్నారు కొట్టుకున్నారు చంపుకున్నారు కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి ములాకత్ అవుదాం అని పొత్తు పెట్టుకుని మా పైన యుద్ధానికి వస్తున్నారన్నారు. నాకు 24 ఏళ్ళ వయసు అప్పుడే నా వెంట ఎవరూ లేనప్పుడు ప్రజలను నమ్ముకుని నందికొట్కూరు నియోజకవర్గంలో గడప గడప తిరిగి పర్యటించి గ్రామ గ్రామాల్లో తిరిగి జగనన్నకు ఓటు వేయమని అడిగాను అప్పుడే నేను వీళ్లకు భయపడలేదు ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదం మీ అందరి ప్రేమ అభిమానం ఉన్నప్పుడే వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. నాలుగున్నర సంవత్సరాలలో ఎన్నో అవమానాలు పడ్డాం ఇబ్బందులు పడ్డామన్నారు. సొమ్మొకడిది సోకొకడిది అన్న చందంగా కష్టపడేది మేము అధికారం అందించేది ఒకరు పార్టీ కోసం కష్టపడేది మేము వచ్చి పెత్తనం చేసింది మరొకడు ఇటువంటివి ఎన్నో అవమానాలు పడ్డామన్నారు. ఎన్ని అమౌంట్ పడ్డ ఇంత ధైర్యంగా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నామంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులేనని అన్నారు. జగనన్న చేసిన మంచి చెప్పుకుంటూ నే మీ ఇండ్ల కాడికి వస్తాము మీ ఊరికి వస్తాము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరోసారి ఆశీర్వదించమని అడుగుతామన్నారు. వచ్చి పోయిన తర్వాత కూడా కండవాలు వేసుకొని సైకిల్ గ్యాస్ సిలిండర్లు కలుపుకొని కొందరు వస్తారు మీరు ఒకసారి ఆలోచన చేయండి సిద్ధార్థ రెడ్డి వచ్చి చెప్పి పోయినాడు అందులో ఎంత నిజం ఉంది అని ఇంత మంచి చేశాడో అని ఆలోచించి జగన్ సార్ ను ఆశీర్వదించాలని అన్నారు. మాజీ జెడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను 99 శాతం పూర్తి చేస్తూ ఎవరి రికమండేషన్ లేకుండా ఎవ్వరి వత్తాసు లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీ ఖాతాలో సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని ఆయన తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేస్తూ ప్రజాపాలన చేస్తున్న ఒకే ఒక్క నాయకుడు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారంటే అతడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. 2014 నుంచి 2019 వరకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీకు ఎన్నో పనులు చేస్తామని హామీలిచ్చి మాయ మాటలు చెప్పారన్నారు. 2019 తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయిన అనంతరం మీ కుటుంబాలలో ఎంత ఆర్థిక అభివృద్ధి చెందాయి ఏ విధంగా అభివృద్ధి చెందారు ఒక పేరు ఆలోచించాలన్నార. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీ నియోజకవర్గము అంట కదా అన్న అని మమ్మల్ని అడుగుతుంటే ఎంతో గర్వంగా ఉంది అన్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత స్థితిలో ఉన్న నందికొట్కూరు నియోజవర్గమే ఆయన ఊపిరి అన్నారు. అనంతరం రూ 6. 82 కోట్ల మెగా చెక్కును డ్వాక్రా గ్రూప్ మహిళలకు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పుల్యాల దివ్య, ఎంపీపీ మండ్ల మల్లేశ్వరి, సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న, ఎంపీడీవో కవి రాజు, ఎంఈఓ సుభాన్, ఈ ఓ ఆర్ డి నాగేంద్రయ్య, ఏపీఎం శ్రీనివాసులు, ఏపీవో మద్దిలేటి, పంచాయతీ కార్యదర్శి ఉపేంద్రారెడ్డి, శివానంద భారతి స్వామి, వైసిపి నాయకులు మండ్ల మురళి , వెంకట్, జబ్బార్ డ్వాక్రా మహిళలు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️