తాగునీటి సమస్య పట్టని వైసిపి నేతలు – భూమా అఖిలప్రియ

Mar 31,2024 17:13

సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరిస్తున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

తాగునీటి సమస్య పట్టని వైసిపి నేతలు – భూమా అఖిలప్రియ
ప్రజాశక్తి – చాగలమర్రి
నియోజకవర్గంలోని గ్రామాలలో నెలకొన్న తాగునీటి సమస్యను అధికార పార్టీ వైసిపి నాయకులు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఆదివారం స్థానిక చిన్న మఖానం కాలనీ, శివాలయం కాలనీలలో మాజీ మంత్రి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షులు ఎంఎస్‌ అన్సర్‌ భాష ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, భూమా అభిమానులు గజమాలతో మాజీ మంత్రికి ఘన స్వాగతం పలికారు. చిన్న మకానంలోని దస్తగిరి స్వామికి మాజీ మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయా కాలనీలలో ఇంటింటికెళ్ళి సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉన్నా ఎమ్మెల్యే హోదాలో ఉండి అధికారులతో సమావేశం ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. చాగలమర్రిలో పారిశుధ్యం పూర్తిగా లోపించిందని, రోడ్లపై చెత్త చెదారంతో పరిస్థితి ఘోరంగా నెలకొందన్నారు. అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడానికి చూపిస్తున్న శ్రద్ధ పారిశుధ్యంపై చూపించడం లేదన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి జగన్‌ మోహన్‌ రెడ్డి రూ. 100 కోట్లు ఇస్తామని హామీనిచ్చారని, వాటిలో ఒక్క రూపాయి కూడా ఎమ్మెల్యే తీసుకురాలేకపోయారని అన్నారు. నియోజకవర్గంలో గంజాయి, డ్రగ్స్‌ విచ్చలవిడిగా సరఫరా అవుతూ యువత జీవితాలు నాశనమవుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిపై రైతులు చెప్పులు వేసే స్థాయికి వచ్చారంటే వారి బాధ ఏ స్థాయిలో ఉందో గమనించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ లాయర్‌ నరసింహారెడ్డి, మైనార్టీ నాయకులు కొలిమి హుస్సేన్‌ వల్లి, ఎన్‌ ఎండి రఫీదిన్‌, కొలిమి మాబూ షరీఫ్‌, ఆలంసాగారి మౌలాలి, సల్ల నాగరాజు, మద్దూరు మాబులాల్‌, హనీఫ్‌, షాబా, బోలా భాష ,అమీర్‌ గఫార్‌, జట్టి నాగరాజు, కేఆర్‌కె రవి, షబ్బీర్‌, బషీర్‌, అబ్దుల్లా, ముల్లా అజీమ్‌, కరిముల్లా, నాగూర్‌, రఫీ, కశినేని ఓబులేష్‌, జెట్టి బాలుడు తదితరులు పాల్గొన్నారు.

➡️