రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి

Feb 12,2024 21:17

మృతి చెందిన చిరుత పులి

రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి
ప్రజాశక్తి – ఆత్మకూర్‌
ఆత్మకూర్‌ మండల పరిధిలోని నల్లమల అడవిలో కర్నూలు-గుంటూరు రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుతపులి మృతి చెందింది. చిరుతపులి మృతి చెంది ఉండడాన్ని గమనించిన బైర్లూటీ చెంచు గూడెం గిరిజనులు సోమవారం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిరుతపులి వయస్సు సంవత్సరంలోపు ఉండ వచ్చని, వాహనం ఢకొీట్టడం వల్లనే చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. బైర్లూటి గూడెం సమీపంలో కర్నూలు-గుంటూరు రహదారిపై స్పీడ్‌ బ్రేకులు వేయాలని విన్నవించినప్పటికీ వేయక పోవడంతోనే జంతువులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా బైర్లూటి గూడెం సమీపంలో రోడ్డుపై స్పీడ్‌ బ్రేకులు వేయించాలని గూడెం ప్రజలు, అటవీశాఖ అధికారులు కోరుతున్నారు.

➡️