వైసిపి కార్యకర్తలు సైనికులా పని చేయాలి

Feb 12,2024 19:53

మాట్లాడుతున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

వైసిపి కార్యకర్తలు సైనికులా పని చేయాలి

– బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

అందరికీ అందుబాటులో ఉండి నందికొట్కూరు అభివృద్ధి చేస్తా : వైసిపి అభ్యర్థి డాక్టర్‌ దారా సుధీర్‌

ప్రజాశక్తి – పాములపాడు

గడిచిన ఐదు సంవత్సరాల్లో కార్యకర్తలు ఎన్ని కష్టాలు వచ్చినా జెండాను వదలకుండా పనిచేశారని మళ్లీ జగనన్న కోసం కార్యకర్తలు సైనికులా పనిచేసే ముఖ్యమంత్రి చేసుకుంటే వచ్చేవి మంచి రోజులని రాష్ట్ర శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. సోమవారం బానకచర్ల గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆవుల వెంకటనారాయణ రెడ్డి, సర్పంచి ఆవుల జయసుధల స్వగృహము నందు ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నందికొట్కూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ ధార సుధీర్‌ పాములపాడు మండల వైసిపి కార్యకర్తలకు మండల వైసీపీ అధ్యక్షులు జి రామలింగేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పరిచయ కార్యక్రమం నిర్వ హించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలలో కార్యకర్తలు ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ కోసం పని చేయడంలో వెన్ను తిరగలేదన్నారు. మళ్లీ జగనన్నను గెలిపించేందుకు సైనికులు లాగా పని చేయాలన్నారు. ధార సుధీర్‌ మాట్లాడుతూ సిద్ధార్థ రెడ్డి సహకారంతో ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు, కార్యకర్తల సహకారంతో మీ అందరికీ అందుబాటులో ఉండి మీ సమస్యల పరిష్కారానికి పని చేస్తూ నందికొట్కూరును ఓ నూతన నందికొట్కురుగా తయారు చేస్తానన్నారు. మీరందరి సహకారంతో ముందుకు సాగుతానని జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేసేందుకు మీ దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమం కన్నా ముందర ఎర్ర గూడూరు గ్రామ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ధార సుధీర్‌లు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు జి రామలింగేశ్వర రెడ్డి, మండల సచివాలయల ఇన్చార్జి టి నాగరాజు, మద్దూర్‌ సింగిల్‌ విండో సొసైటీ చైర్మన్‌ గడ్డం కృష్ణారెడ్డి, నాయకులు విజయసింహారెడ్డి, ఎల్వి రమణారెడ్డి, బాలేశ్వర్‌ రెడ్డి, బంగారు బాష, వెంకటేశ్వర్‌ రెడ్డి, కోట్ల నాగేశ్వర్‌ రెడ్డి, జబ్బారు, బాలు నాయక్‌, రుద్రవరం సర్పంచ్‌ రామస్వామి,తుమ్మలూరు, సర్పంచ్‌ వరప్రసాద్‌, ఉపసర్పంచ్‌ నరసింహులు, సమ్మద్‌, రాజశేఖర్‌ ప్రభాకర్‌, అంబయ్య, పుల్లయ్య నాయకులు పాల్గొన్నారు.

➡️