వైసిపి నుండి 50 కుటుంబాలు టిడిపిలో చేరిక

Mar 31,2024 17:18

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరుతున్న వైసీపీ నాయకులు

వైసిపి నుండి 50 కుటుంబాలు టిడిపిలో చేరిక
ప్రజాశక్తి – బనగానపల్లె
మండలంలోని రామతీర్థం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి సమక్షంలో ఆదివారం టిడిపిలో చేరారు. పట్టణంలోని టిడిపి కార్యాలయంలో రామతీర్థం వైసిపి నాయకులు చాగలమర్రి రామకృష్ణుడు, చాగలమర్రి రమణ, తుపాకుల ప్రసాద్‌, తుపాకుల సుధాకర్‌, పోలం శేఖర్‌, కోవెలకుంట్ల ఆజాం, సలాం వెంకటేశ్వర్లు, ముల్ల మాలి, ముల్ల మహమ్మద్‌ గౌస్‌, దొరాశి శ్రీను, కందుకూరి భాస్కర్‌, రేవనూరు పెద్ద హుస్సేన్‌ సా, మర్రి చిన్న మద్దిలేటి, మర్రి మదన్‌ గోపాల్‌, మర్రి మద్దయ్య, షేక్‌ అబ్బాష్‌, ఈడిగ రామాంజనేయులు, చాకలి ఆంజనేయులు, చాకలి ఈశ్వరయ్య, చాకలి నరసింహుడు, పెద్ద వలి, చాగలమర్రి హుస్సేనప్ప, డొల్లు జంగమయ్య, డొల్లు గోపాల్‌ తదితర 50 కుటుంబాలు టిడిపిలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిసి జనార్దన్‌ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. అందరం కలిసికట్టుగా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చిన అండగా ఉంటామని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.

➡️