పీడిత ప్రజల ఉద్ధరణ కోసమే అంబేద్కర్ జీవితం : యుటిఎఫ్

Apr 14,2025 11:30 #Nandyala district

ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్ : అంబేద్కర్ ఆశయాలు జీవితాంతం పీడిత, తాడిత, దళిత బహుజనుల ఉద్ధరణ కోసమే పనిచేశారని యుటిఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి జే సుధాకర్, జిల్లా కార్యదర్శి ముర్తు జావలి అన్నారు. అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా సోమవారం నందికొట్కూరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ…
అందరూ చదువు కొంటేనే సాంఘిక, అర్థిక సమానత్వం సాధ్యమవుతుందని అంబేద్కర్ బావించే వాడని కానీ నేడు ప్రభుత్వ బడులు నానా టికీ చిదిమి వేయ బడుతున్నాయని తెలిపారు. విద్య వ్యాపారం గా మారిందని, ఈ దుస్థితి పోవాలని, అందుకు మనం అందరం నడుం బిగించి పోరాడాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం జరగాలంటే నేటి యువత, రాజకీయ నాయకులు అంబేద్కర్ ఆశయాలను పుణికిపుచ్చు కొని అందుకు అనుగుణంగా పనిచేయాలని అప్పుడే అంబేద్కర్ కళలు సాకారం అవుతాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్ర శేఖర్, వాసు, తిక్క స్వామి, తిరుమలయ్య, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

➡️