ఎమ్మెల్యే గిత్త జయసూర్య
ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్ : సీఎం సహాయనిధి పేదలకు ఒక వరం లాంటిదని నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. బుధవారం పట్టణంలోని రాజా వీధి 21 వార్డులో తిరుపాలుకు సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన 49 వేల రూపాయలకు చెందిన చెక్కును బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, కన్వీనర్ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రబ్బాని, చిన్న నాగన్న, మద్దిలేటి, వెంకటేశ్వర్లు, షకీల్ మహమ్మద్, పలుచాని మహేశ్వర రెడ్డి, శెట్టి రవి, బంగారు రమణారెడ్డి, గిరి, హుసేన్, బ్రహ్మయ్య, శ్రీకాంత్, ఇంతియాస్, లింగమయ్య, కలాకర్ తదితరులు పాల్గొన్నారు.