ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సిపిఎం పోరు 

Nov 9,2024 15:22 #Nandyala district

ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈనెల 14వ తేదీ మండల కార్యాలయం ముందు ధర్నాలు జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం నందికొట్కూరు పట్టణంలోని భారత్ కాంప్లెక్స్ ఆవరణలో సిపిఎం ప్రజాసంఘాల నాయకులు పటాన్ సలాం ఖాన్, ఎం కర్ణ, టి గోపాలకృష్ణ, కే వెంకటేశ్వర్లు, ఎస్ ఉస్మాన్ భాష, సి నాగన్న, డి బాబు, అబ్దుల్ రషీద్, సాజిదాబి ఆంజనేయులు, బోయ పాండులతో కలిసి ప్రజాపోరు పోస్టరును విడుదల చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల మూలంగా మహిళలు, మైనార్టీలు, దళితులపైన దాడులు అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వీటిని అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని వారు ఆరోపించారు. నిత్యవసర సరుకులు ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయని వాటి మూలంగా పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్న భర్తీ చేయడం లేదని వారు ఆరోపించారు. కేంద్రంలోని ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి పది సంవత్సరాలు అవుతున్న అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని కాలయాపన చేస్తుందన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు చార్జీలు రూ 6000 కోట్లు వేసిన భారాన్ని వెంటనే ఉపసరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈనెల 14వ తేదీ మండల కేంద్రాల్లో జరిగే ఆందోళనలో ప్రజలందరు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

➡️