ఐక్యతతోనే వడ్డెర్ల అభివృద్ధి సాధ్యం

Nov 11,2024 11:25 #Nandyala district

ఎడారి బతుకులకు ఎస్టీ సాధన దారి దీపం
డాక్టర్ బత్తుల సంజీవరాయుడు

ప్రజాశక్తి-నంద్యాల అర్బన్ : ఆంధ్రప్రదేశ్ వడ్డెర్ల ఎడారి బ్రతుకులు బాగుపడాలంటే ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ అభివృద్ధి శాఖ మంత్రికి సోమవారం నాడు జాతీయ బీసీల కార్యదర్శి డాక్టర్ బత్తుల సంజీవరాయుడు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మెమరాండం సమర్పించడం జరిగింది. జనవరి 11వ తేదీన రాష్ట్ర వడ్డెర్ల మహాసభ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. రాష్ట్రంలోని వడ్డెర్లందరూ ఐక్యతతో పాల్గొనాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మన కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలని అందరం కోరుదాం. వడ్డెర కార్పొరేషన్కు 250 కోట్లు బడ్జెట్ మంజూరు చేయాలని మైనింగ్ క్వారీలలో, నాపరాయి గనులలో 25% రిజర్వ్ చేయాలని కోరుదాం అన్నారు.

➡️