ప్రజాశక్తి-కొత్తపల్లి : గ్రామీణ ప్రాంతంలో ఉన్న పల్లె క్రీడా కారుడు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణమోహన్ వ్యాయామ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ తెలిపారు. గురువారం మండలంలోని దుద్యాల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారుని పాఠశాల ఉపాధ్యాయ బృందం సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అండర్ 17 బాల్ బాడ్మింటన్ రాష్ట్రస్థాయి పోటీలకు మా పాఠశాల విద్యార్థి ఎస్ గంగాధర్ రెడ్డి ఎంపిక కావడం జరిగిందన్నారు. ఎంపికైన విద్యార్థి ఈనెల 9,10 తేదీలలో తూర్పుగోదావరి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడలలో పాల్గొనడం జరుగుతుందన్నారు. రాష్ట్రస్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరిచి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అభినందనలు తెలిపారు. విద్యార్థులు క్రీడా సర్టిఫికెట్లు సంపాదించుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సంపాదించుకునేందుకు వీలు ఉంటుందన్నారు. ఈ అభినందన కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు రామ చంద్రుడు కృష్ణయ్య రాఘవేంద్ర విజయ్ కుమార్ రామయ్య వసుంధర భారతి నూర్ జాన్ శ్రీ సుధా పాల్గొన్నారు.