ఉపాధి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

Mar 10,2025 12:53 #Nandyala district

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం నాగేశ్వరావు

ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్ : ఉపాధి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం నాగేశ్వరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నందికొట్కూరు మండలం మల్యాల, బిజినవేముల గ్రామాలలో ఉపాధి పనులను వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకుడు కే వెంకటేశ్వర్లు తో కలిసి పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలో భాగంగా కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లో ఉపాధి నిధులను తగ్గించడం జరిగిందని వారు ఆరోపించారు. వేసవి కాలంలో ఇస్తున్న సమ్మర్ అలవెన్స్ ను రద్దు చేయడం, గడ్డపార, మంచినీటికి, గంపకిస్తున్న వేతనాలను ఇవ్వకుండా నిలిపివేశారని, పనుల దగ్గర ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడం మూలంగా ఉపాధి కూలీలు వడదెబ్బకు మృత్యువాత పడుతున్నారని వారు ఆరోపించారు. పనిచేస్తున్న ఉపాధి కూలీలకు గడ్డపార ,గంప ,సలిక పనిముట్లు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. పనిచేసిన ఉపాధి కూలీలకు వారం రోజుల్లో వేతనాలు చెల్లించాలని చట్టంలో ఉన్న నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా ఉపాధి కూలీలను కడుపులు మారుస్తున్నారని వారు ఆరోపించారు, ఉపాధి పనుల దగ్గర గాయాలైన వారికి ప్రాథమిక చికిత్స కోసం గతంలో మెడికల్ కిట్టు ఇచ్చే వారిని నేడు ఇవ్వకుండా రద్దు చేశారని వారు ఆరోపించారు, వ్యవసాయ రంగంలో పని దినాలు తగ్గిపోయి వలసలు వెళుతున్నారని వలసలు నివారించేందుకు ఉపాధి హామీ చట్టం ద్వారా వంద రోజుల నుండి 200 రోజులకు పని దినాలు పెంచాలని, రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యవసర సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధరలు పెరిగాయని వాటికి అనుగుణంగా ఉపాధి కూలీల వేతనాలను రోజుకు రూ 500 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉపాధి మేటులకు పారితోషికం రూ 5 వందల రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12వ తేదీన విజయవాడలో మహాధర్నను జయప్రదం చేసేందుకు ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు బిజినవేముల గ్రామానికి చెందిన ఎం రంగన్న, రామన్న, విజయ్ కుమార్, భాగ్యమ్మ, మల్యాల గ్రామానికి చెందిన భీమగుండం, బోయ సవారి, ఏ శ్రీనివాసులు, మద్దిలేటి, కృష్ణ, రమణమ్మ, ఎస్తేర్ అమ్మ, లక్ష్మీదేవి, మమత, రత్నకుమారి, కోటేశ్వరమ్మ ,చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు

➡️