ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్ : నాటు సారా తయారు చేసిన విక్రయించిన కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు హెచ్చరించారు. గురువారం నందికొట్కూరు పట్టణంలోని షికారి పేటలో ఎక్సైజ్ పోలీసులు అకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నాటు సారా తయారీకి సిద్ధం చేసిన దాదాపు 600 లీటర్ల బెల్లం ఊటను, 20 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారు. సందర్భంగా ఎక్సైజ్ రామాంజనేయులు మాట్లాడుతూ నాటు సారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఆదేశాల మేరకు, నంద్యాల జిల్లా ఎక్సైజ్ అధికారి రవికుమారి సూచనల మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై జఫరుల్లా, హెడ్ కానిస్టేబుల్ శంకర నాయక్, కుమారి, కానిస్టేబుల్ శివన్న, మధు ప్రసాద్, సుధీర్ పాల్గొన్నారు
