ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్ : దళితవాడల అభివృద్ధికై నిధులు మంజూరు చేయాలని వ్యాకాస జిల్లా నాయకులు కర్ణ, ఫకీర్ సాహెబ్, గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం జూపాడుబంగ్లా మండలం పారుమంచాల, తంగడంచ గ్రామాలలో నీ వాడల్లో సమస్యలను గురించి సర్వే నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దళితవాడల్లో డ్రైనేజీలు లేక మురికి నీరు నిలువ ఉంటుందని దీనివల్ల దీనివల్ల ప్రజలు రోగాల బారిన ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా దళితులు సాగు చేసుకుంటున్న భూములను ఇతర కులాలకు చెందినవారు పాస్ పుస్తకాలు ఆన్లైన్లో వారి పేర్ల మీద నమోదు చేయించుకోవడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు. అదేవిధంగా పారుమంచాల గ్రామంలో వాటర్ ట్యాంక్ శిథిలా వ్యవస్థకు చేరుకున్నదని ఎప్పుడు పడిపోతదో అని ప్రజలు ప్రయోగాంతులకు గురవుతున్నారని తెలిపారు. పాత వాటర్ ట్యాంక్ స్థానంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని డిమాండ్ చేశారు. దళిత రైతు పెద్ద శివన్న సొసైటీ బ్యాంకులో అప్పు కట్టలేదని ఆయన ఆత్మ గౌరవం దెబ్బ తీసే విధంగా గ్రామంలో ఆయన పొలం వేలంపాటకు దండోరా వేయించటం ఏమిటని? వారు ప్రశ్నించారు. కార్పొరేట్ శక్తులు బ్యాంకులకు అప్పులు ఎగరగొట్టే ఎటువంటి చర్యలు తీసుకపోగా అటువంటి దొంగలకే రక్షణ కల్పించడం ఈ ప్రభుత్వాలకు సిగ్గుచేటమే విమర్శించారు. సంబంధించిన సొసైటీ అధికారులు బ్యాంకు అధికారులు సామరస్యంగా రైతుల వద్ద అప్పులు చెల్లించుకోవాలని కోరారు. అదేవిధంగా దళిత స్మశానాలలో బోరు షెడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితుల హక్కుల అమలు కావడానికి ఆత్మగౌరవంతో ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లోకా రెడ్డి, పెద్ద శివన్న కాలనీవాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
