ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలి 

Nov 14,2024 12:42 #Nandyala district

నిత్యావసర ధరలను అదుపు చేయాలి..

కలెక్టరేట్ ముందు సిపిఎం నిరసన ధర్నా

ప్రజాశక్తి-నంద్యాల కలెక్టరేట్ : అనేకమంది ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని,ప్రభుత్వాలు వచ్చిన 3 నెలల్లోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారలు వేస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరు కార్యక్రమంలో భాగంగా గురువారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు సిపిఎం పట్టణ కార్యదర్శి పుల్ల నరసింహఅధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం నిత్యావసర ధరలు పెరిగాయి. ప్రపంచంలో ఆయిల్ ధరలు తగ్గిన మనదేశంలో పెట్రోల్, డిజల్ ధరలు తగ్గడం లేదన్నారు.వంటనూనె ధరలను విపరీతంగా పెంచారని ఆరోపించారు. ఓకే ఎన్నిక ఓకే దేశం పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. ఆదాని, అంబానీలకు ఊడిగం చేసేలా నరేంద్ర మోడీ వ్యవహారిస్తున్నారని విమర్శించారు.
రాష్టంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జిలను పెంచుతుంది. ప్రజలపైన 18 వేల కోట్లు భారం ప్రజలపైన వేస్తున్నారు. తాగుదానమ్మ అంటూ ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు పెడుతు రూ. 13 వేల రూపాయలు ఒక్కో ఇంటిపైన వేస్తున్నారన్నారు. ఉచిత ఇసుక హామీని గాలికొదిలేసి, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం లో ఇసుక ధరలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు.
మహిళలపైన, మైనార్టీల పైన దాడులు పెరిగిపోతున్నాయని దాడులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం వైపల్యం చెందిందన్నారు. నిత్యావసర ధరలు తగ్గించాలని, విద్యుత్ ట్రూ ఆఫ్ చార్జీలు రద్దు చేయాలని, ఉచిత ఇసుక అమలు చేయాలని రమేష్ కుమార్ డిమాండు చేశారు.అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.నాగరాజు మాట్లాడుతూ రాష్టంలో గత వైసిపీ ప్రభుత్వం ప్రజలకు సరైన పాలన అందించనందుకే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారని, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారం లోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలు చేసే పరిస్థితి కనపడలేదన్నారు.
మూడు పర్యాయలు అధికారంలోకి వచ్చిన బిజెపి వాగ్దానాలకు విరుద్ధంగా పరిపాలన తప్ప ఒక్క వాగ్దానాన్ని అమలు చేసిన పాపాన పోలేదన్నారు.గత ప్రభుత్వం ధరలను అదుపు చేయలేకపోయిందని, నేను వస్తే ధరలను అదుపు చేస్తా కరెంటు చార్జీలు తగ్గిస్తానని చెప్పి హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ధరలను నియంత్రించలేక చేతులెత్తేశారని విమర్శించారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే ధరలు తగ్గించకపోతే ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అనంతరం సిపిఎం బండి ఆత్మకూర్ మండల కార్యదర్శి రత్నమయ్య, నంద్యాల మండల కార్యదర్శి బాల వెంకట్, సిపిఎం నంద్యాల పట్టణ కార్యదర్శ వర్గ సభ్యులు కే ఎం డి గౌస్, డి. లక్ష్మణ్ తదితరులు మాట్లాడారు. ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకట్ లింగం, జయన్న,హుస్సేన్ వలి యూసుఫ్ రాజు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

➡️