కాలనీలో సమస్యలు తెలుసుకుంటున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు
ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్ : జగనన్న కాలనీలో సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు హెచ్చరించారు. గురువారం నందికొట్కూరు మున్సిపాలిటీ కొణిదెల రోడ్డు ఉన్న జగనన్న కాలనీ సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు ఎస్ ఉస్మాన్ భాష, గోకారి తదితరులు కలిసి కాలనీలో పర్యటించడం జరిగింది. అనంతరం కాలనీవాసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్భాటంగా జగనన్న కాలనీ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వం సెంటు స్థలమిచ్చి రూ 1,80,000 మాత్రమే ఇచ్చారు, లబ్ధిదారులు ప్రవేట్ అప్పులు తెచ్చుకొని రూ 5 నుండి రూ 10 లక్షలు పెట్టి ఇల్లు నిర్మించుకున్నారని నేడు కాలనీలో కరెంటు లేక చీకట్లో మగ్గుతున్నారు, రోడ్లు లేకపోవటం వల్ల వర్షాకాలంలో, రాత్రి సమయాల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మంచినీటి ట్యాంకులు ఏర్పాటుచేసిన వాల్స్ లేకపోవడం నీళ్ళు వదిలే మనిషి లేకపోవడం వల్ల నిరంతరం మంచినీటి కోసం ప్రజలు ఎదురు చూడవలసి వస్తుంది ఒకరోజు నీరు వస్తే 10 రోజులపాటు మంచినీటి కోసం మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అంగన్వాడి సెంటర్ లేకపోవడం వల్ల చిన్న పిల్లలకు చదువులకు దూరం అవుతున్నారు, తల్లిదండ్రులు కూలి పనులు చేసుకోవడానికి అవకాశం లేకుండా చిన్నపిల్లల్ని ఇంటి దగ్గరే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందడం లేదన్నారు. ప్రజా పంపిణీ చౌక డిపో లేకపోవడం వల్ల వితంతు, వికలాంగులు, వృద్ధులకు పింఛన్లు పంపిణీ కాలనీలో చేపట్టకపోవడం వల్ల కాలనీవాసులంతా నందికొట్కూరు టౌన్ లోకి వచ్చి బియ్యము కోసం మరియు పెన్షన్లకు ఆటో ప్రయాణపు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. 2500 కుటుంబాలు ఉన్న బస్ స్టాప్ లేకపోవడం వల్ల కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కావున స్థానిక ఎమ్మెల్యే మున్సిపాలిటీ అధికారులకు స్థానిక తాసిల్దార్ కు అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చిన చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గోకారి షబీర్ శాలి బాషా కాజా మొహమ్మద్ భాషా వి మధు మా భాష సుభాన్ కే లింగన్న అకిలిం భాష ఉషనయ్య నూర్గౌస్ 15 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.