వైసిపి నుంచి టిడిపిలో చేరిక

Feb 12,2024 12:36 #nandyala
Joined TDP from YCP

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో 50 కుటుంబాలు తెదేపాలో చేరిక
ప్రజాశక్తి-చాగలమరి : నంద్యాల జిల్లా చాగలమరి మండలంలోని గొడిగనూరు గ్రామంలో 50 కుటుంబాలు వైసిపి నుంచి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో సోమవారం టిడిపిలో చేరారు గ్రామానికి చెందిన సూర్యనారాయణ చిన్న నరసింహులు, అంకాలు బాలకృష్ణ, సంతోష్, వెంకటసుబ్బయ్య పాటు మరో 45 కుటుంబాలు మాజీ మంత్రి టిడిపి  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిడిపిపై నమ్మకంతో పార్టీలోకి వలసలు వస్తున్నారన్నారు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని చేయాలన్న భూమా కుటుంబమే అని నమ్మి గ్రామాల్లో ప్రజలు తమ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన వివరించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఏనాడైనా అసెంబ్లీలో ప్రశ్నించారని ఆరోపించారు. కార్యక్రమంలో టిడిపి ఆళ్లగడ్డ యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత్రెడ్డి భార్గవ్ రామ్ నాయుడు పాల్గొన్నారు.

➡️