కోళ్ల బావాపురం గ్రామంలో పోలీసుల కార్డాన్ సెర్చ్

నందికొట్కూరు టౌన్‌ :   నందికొట్కూరు మండల పరిధిలోని కోళ్ల బావాపురం గ్రామంలో పోలీసులు ఆదివారం కార్డాన్ సెర్చ్ చేపట్టారు. 30 లీటర్ల సారాయి, 3 నెంబర్‌ లెస్‌ రికార్డ్‌ లెస్‌ ఆటోలను, 9 మోటార్‌ సైకిల్‌ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారన్న అనుమానంతో 30 కేజీల నెయ్యిని కూడా సీజ్‌ చేశామని అన్నారు.   ఈ కార్యక్రమంలో రూరల్‌ సిఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మిడుతూరు ఎస్సై ఓబులేసు, బ్రాహ్మణ కొట్టుకూరు ఎస్సై తిరుపాలు,  14 మంది సర్కిల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️