ఘనంగా రంజాన్‌ వేడుకలు

Apr 11,2024 18:00

బీమవరం దారిలో ఉన్న ఈద్గా లో జరిగిన ప్రత్యేక ప్రార్థన ల్లో పాల్గొన్న టిడిపి జిల్లా కార్యదర్శి ఎన్‌ఎండి.ఫిరోజ్‌

ఘనంగా రంజాన్‌ వేడుకలు
నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్ధనలు
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
మండు టెండలను సైతం లెక్క చేయక నెల రోజుల పాటు కఠోర ఉపవాసాలు చేసి భక్తిని చాటుకున్న ముస్లిం సోదరులు గురువారం జిల్లా వ్యాప్తంగా రంజాన్‌ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం 9 గంటలకు ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నంద్యాలలోని భీమవరం రూట్‌లో ఉన్న మస్జీద్‌ ఏ ఆల్‌ ఫుర్‌ ఖాన్‌ ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్‌ బాషా, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, మాజీ ఎపిపిఎస్‌సి మెంబర్‌ డాక్టర్‌ నౌమాన్‌, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండి ఫిరోజ్‌ తదితరులు పాల్గొన్నారు. నంద్యాలలో మత సామరస్యానికి ప్రతీకగా ప్రజలు కలిసి మెలిసి జీవించాలని వారు కోరారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సాయిబాబా నగర్‌లోని ఈద్గాలో ముస్లిములు ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు.

➡️