అండర్‌ – 14 చెస్‌ టోర్నమెంట్‌ లో నారాయణ విద్యార్థి

ప్రజాశక్తి – రెడ్డిగూడెం (ఎన్టీఆర్‌) : ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో రెడ్డిగూడెం నారాయణ హైస్కూల్‌ విద్యార్థి కొండపర్తి అభి తన ప్రతిభను చూపాడు. విజయవాడ చెస్‌ అసోసియేషన్‌ వారు నిర్వహించిన ఈ పోటీల్లో ఏడు పాయింట్లకు గాను నాలుగు పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడని పాఠశాల ప్రధానోపాధ్యాయులు యు రాధాకృష్ణరెడ్డి సోమవారం తెలిపారు. మంచి ప్రతిభ చూపిన విద్యార్థి అభిని పిఇటి రాంబాబు, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.

➡️