నారేడ్కో ప్రోపర్టీ షో ప్రారంభోత్సవం – సిఎం కి ఘనస్వాగతం

గుంటూరు : నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్మెంట్‌ కౌన్సిల్‌ (నారేడ్కో) , క్యాపిటల్‌ జోన్‌ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహిస్తున్న 16వ నారేడ్కో ప్రోపర్టీ షో ప్రారంభోత్సవానికి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 36 నిముషాలకు గుంటూరు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ హెనీ క్రిస్టినా, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ నాగలక్ష్మి , ఐజీ సర్వశెష్టి త్రిపాఠి, శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, ఎండి నసీర్‌ అహ్మద్‌, కన్నా లక్ష్మీ నారాయణ, జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ పులి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్‌ ఇండిస్టియల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డేగల ప్రభాకర్‌, రాష్ట్ర మాదిగ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉండవల్లి శ్రీదేవి, లిడ్‌ క్యాప్‌ చైర్మన్‌ పిల్లి మాణిక్యరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. హెలిపాడ్‌ నుంచి 12 గంటల 56 నిముషాలకు ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు స్థంబాల గురువులోని చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నారేడ్కో ప్రోపర్టీ షో ప్రాంగణానికి చేరుకున్నారు.

➡️