ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శిగా మండల కేంద్రమైన నార్పలకు చెందిన రిటైర్డ్ విఆర్‌ఓ రామారావు కుమారుడైన నార్పల మారుతి నరసింహ ఎంపికయ్యారు. మంగళవారం ఆయన రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఏలూరులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మారుతి నరసింహ మాట్లాడుతూ … తనను రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎంపిక చేసిన బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య పెద్దలకు ప్రత్యేక కఅతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని బ్రాహ్మణ సోదరులందరికీ అందుబాటులో ఉంటూ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శిగా ఎంపికైన మారుతి నరసింహ ను పలువురు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఎపి రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా నార్పల మారుతి నరసింహ
