హెర్బెరియం విధానాలపై జాతీయ కార్యాచరణ

Nov 27,2024 15:33 #Kadapa

– చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ, పరిశోధనలో ముందుకు రాణించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది
– ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ వి. సురేష్ బాబు

ప్రజాశక్తి – కడప : హెర్బెరియం విధానాలపై జాతీయ కార్యాచరణ కార్యక్రమం విద్యార్థులలో చదువుపట్ల ప్రత్యేక శ్రద్ధ, పరిశోధనలో ముందుకు రాణించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ వి. సురేష్ బాబు అన్నారు. బుధవారం ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయం ప్రతిపత్తి ), కడప వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ స్టార్ స్టేటస్ కార్యక్రమంలో భాగంగా  హెర్బేరియం విధానాలపై రెండు రోజులపాటు  జాతీయ కార్యాచరణ కార్యక్రమంను నిర్వహించారు.  ఈ సందర్భంగా  కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి రవీంద్రనాథ్ మాట్లాడుతూ వృక్ష శాస్త్రంలో కీలకమైన  హెర్బెరియం తయారీ విధానము, పరిశోధనలో వాటి ప్రాముఖ్యత వంటి అంశాలపై విభాగం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు.  యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ పి సుబ్రహ్మణ్యం, ఎస్ కే ఆర్ అండ్ ఎస్ కే ఆర్  మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులకు హెర్బెరియం తయారీ విధానాలపై హాండ్స్ ఆన్ ట్రైనింగ్ పద్ధతుల ద్వారా వివరించారు. వృక్ష శాస్త్ర విభాగాధిపతి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..  బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాల్లో హెర్బెరియం లో ఉద్యోగాలు  సాధించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఇతర డిగ్రీ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.  కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. రమేష్, తిలక్ విద్యాసాగర్, శివరామకృష్ణ,  డాక్టర్ నీలయ్య పాల్గొన్నారు.

➡️