ఫొటోగ్రాఫర్‌ కోటేశ్వరరావుకు జాతీయస్థాయి అవార్డు

Jan 8,2025 23:35

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : స్థానిక కొరిటపాడుకు చెందిన ఇ.శివకోటేశ్వరరావుకు జాతీయ స్థాయిలో ఉత్తమ ఫొటోగ్రఫీ అవార్డు దక్కింది. ఈనెల 6, 7 తేదీల్లో ఒడిస్సాలో హుస్సేన్‌ ఖాన్‌ ఏడవ జాతీయస్థాయి ఫొటోగ్రఫీ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ఫొటోగ్రాఫర్లకు పోటీలు నిర్వహించగా గుంటూరు ‘భాను స్టూడియో’కు చెందిన శివకోటేశ్వరరావు అవార్డుకు ఎంపికయ్యారు. ఒడిస్సాలోని బోండాస్‌ తెగ జీవనశైలిపై ఆయన తీసిన ఫొటోగ్రాఫ్‌కు ప్రత్యేక జూరి అవార్డును ప్రకటించారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. శివకోటేశ్వరరావు గతంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని జర్నలిజం విభాగంలో డిప్లమా ఇన్‌ ఫొటోగ్రఫీ కోర్సును పూర్తి చేశారు.

➡️