జయకుమార్‌కు జాతీయ అవార్డు

ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండకు చెందిన సాంత్వనాసేవా సమితి డైరెక్టర్‌ రావినూతల జయ కుమార్‌కు అంబేద్కర్‌ జాతీయ సేవా రత్న అవార్డు దక్కింది. సేవా కార్యక్రమాలు, బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, బాలల వెట్టి చాకిరి నిర్మూలన, బాల కార్మికుల వ్యవస్థ, బంగారు బాల్యం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినందుకు గానూ జయకుమార్‌ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. రాజమండ్రిలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయవాది, తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్స్‌ జెఎసి నాయకులు ఆదిలక్ష్మి, ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాది మరియు రాష్ట్ర ఎన్‌జిఒల సంఘం అధ్యక్షురాలు డాక్టర్‌.లక్ష్మీ చేతుల మీదుగా జయకుమార్‌ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా జయకుమార్‌.మాట్లాడుతూ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయా ప్రారంభించిన బంగారు బాల్యం కార్యక్రమం ద్వారా బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, బాలల వెట్టి చాకిరి నిర్మూలన, బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసినందుకు గానూ తనకు ఈ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

➡️