ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : సైన్స్ అండ్ టెక్నాలజీలో పురోగతి సాధించినప్పుడే దేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ రాఘవేంద్ర అన్నారు. మంగళవారం ఆదోనిలోని మిల్టన్ గ్రామ స్కూలులో నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని కరస్పాండెంట్ రమేష్ బాబు ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు కొత్త తరం సృజనాత్మకత ఆలోచనలు వెలికి తీసే ప్రయత్నం నిరంతరం జరుగుతునే ఉండాలన్నారు. విద్యార్థులకు సాంకేతికతతోపాటు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందించడంలో సైన్స్ ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
