జాతీయ యువజన దినోత్సవం

ప్రజాశక్తి-అద్దంకి : కెఆర్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ యువజన దినోత్సవం, విశ్వ హిందీ దినోత్సవం, సంక్రాంతి సంబరాలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భ:గా జనవరి 12న వివేకానంద జయంతిని పురస్కరించకుని యువత బాధ్యత-భారతదేశ భవిష్యత్తు అనే అంశం పై ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వి మోహనరావు మాట్లాడారు. హిందీ అధ్యాపకులు సత్యనారాయణ మాట్లాడుతూ హిందీ అంతర్జాతీయ భాసగా ఎదుగుతున్న విధానం గురించి వివరించారు. అనంతరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గులు, ఫ్యాన్సి డ్రస్‌, వాలీబాల్‌ పోటీలలో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కామర్స్‌ అధ్యాపకుడు శిఖామణి, తెలుగు అధ్యాపకురాలు డాక్టర్‌ అనిత,ఫిజిక్స్‌ లెక్చరర్‌ వి.ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️