నాటు భలే ఘాటు

Dec 5,2024 16:14 #anatapuram, #police

ప్రజాశక్తి – ఆత్మకూరు : ప్రభుత్వం అతి తక్కువ ధరలతో మద్యం దుకాణాలు మద్యం సరఫరా చేస్తున్నప్పటికీ, ఎక్కువ మంది మద్యం ప్రియులు ప్రభుత్వం పంపిణీ చేసే మద్యం కంటే, నాటు సారా వైపే మగ్గుచూపుతున్నారు. నాటుసారా భలే ఘాటుగా తయారు చేయడంతో అధిక శాతం పల్లెల్లో మద్యం ప్రియులు నాటు సారానే తాగుతున్నారు.  మండలంలోని ముఖ్యంగా గిరిజన ప్రాంత తండాల్లో మారుమూల ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో నాటు సారా తయారు చేస్తున్నట్లు ప్రత్యక్షంగా ప్రచారం అవుతుంది. అయితే ఇటీవల మండలంలోని పలు గ్రామ తండాల్లో ఎక్సైజ్ అధికారులు నామాత్రంగా తనిఖీలు చేసి, చూసీ చూడనట్లు  వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమతున్నాయి. ఆత్మకూరు మండలంలోని సింగంపల్లి తండా, గొరిదిండ్ల తండా, వేపచెర్ల ఎగువ దిగువ తండాల్లో నాటు సారా తయారవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే, తూతూ మంత్రంగా తనిఖీలు వల్లే నాటు సారా వ్యాపారాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

➡️