ప్రజాశక్తి- బొబ్బిలిరూరల్ : ప్రతి రైతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించేలా అవగాహన కల్పించాలని ప్రకృతి వ్యవసాయ శాఖ డిపిఎం ఎం.ఆనందరావు తెలిపారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఎపి రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో వెలుగు, వ్యవసాయ, ప్రకృతి వ్యవసాయ శాఖలతో ప్రకృతి వ్యవసాయం, నవధాన్యాల సాగుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులు, పురుగు మందులు వాడకం లేకుండా జీరో కాస్ట్ విధానం ద్వారా ప్రకృతి సిద్ధ వనరులతో చిరు, నవధాన్యాల సాగుపై అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ ఎడి ఎం.శ్యామసుందర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతో పాటు రైతులు అనుబంధ సాగు పద్ధతులు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో వెలుగు ఎపిఎం పి.భాగ్యలక్ష్మి, డిపిఎం రమేష్ నాయుడు, సిసిలు, విఒఎలు పాల్గొన్నారు.
వేపాడ : మండలంలోని ఎన్‌కెఆర్ పురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై గ్రామసభ ఏర్పాటు చేశారు. ఎంపిటిసి వి.వి. చినరామినాయుడు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ గొటివాడ దేవి, పి.రమణ, జగ్గు బాబు, రామ్మూర్తి నాయుడు, పెదనాయుడు, ఒబి కృష్ణ శాంతి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సన్యాసమ్మ, నారాయణమ్మ, ప్రసాద్, దేముడు, వెంకటరావు, ఈశ్వర్, రమణమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.
శృంగవరపుకోట : ప్రకృతి వ్యవసాయ, మండల సమాఖ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎఒ రవీంద్ర అన్నారు. గురువారం మండల సమాఖ్య కార్యాలయంలో విఒఎలకు, ప్రకృతి సిబ్బందికి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులను ప్రకృతి వ్యవసాయంలో మార్చడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎపిఎం యు.రమణ, రాష్ట్ర స్థాయి అధికారి కృష్ణప్రసాద్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అనురాధ పాల్గొన్నారు.