నార్పల నూతన విద్యుత్‌ ఏఈగా నీలకంఠ

Feb 4,2025 12:04 #Narpala New Vidyut AE

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : నార్పల మండల నూతన విద్యుత్‌ ఏఈగా నీలకంఠ బాధ్యతలు చేపట్టారు. గత కొద్ది కాలంగా నార్పల మండలానికి రెగ్యులర్‌ విద్యుత్‌ ఏఈ లేక మండల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఏడినే నార్పల ఇంచార్జ్‌ ఏఈగా ఉండేవారు. రెగ్యులర్‌ విద్యుత్‌ ఏఈ లేక మండల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అంటూ … ప్రజాశక్తి వరుస కథనాలు రావడం తో స్పందించిన స్థానిక ప్రజా ప్రతినిధులు స్థానిక శాసనసభ్యురాలు బండారు శ్రావణశ్రీ దృష్టికి తీసుకెళ్లడంతో విద్యుత్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి నార్పలకు రెగ్యులర్‌గా ఏఈ వచ్చే విధంగా కృషి చేశారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ ప్రధాన కార్యాలయంలో డి వన్‌ గా విధులు నిర్వహించే నీలకంఠ పదోన్నతి పై నార్పల నూతన ఏఈ గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … మండల ప్రజలకు మండల రైతులకు అందుబాటులో ఉంటూ ఎలాంటి విద్యుత్‌ సమస్యలు లేకుండా కఅషి చేస్తానని తెలిపారు. అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధులు మండల అధికారులను ఏఈ కలిశారు నూతన ఏఈ నీ పలువురు అభినందించారు.

➡️