20న నీట్‌ మోడల్‌ పరీక్ష

ప్రజాశక్తి – ఒంగోలు సిటీ : డివైఎఫ్‌ఐ ఆధ్వరంలో ఈనెల 20న నీట్‌ మోడల్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ నాయకులు ప్రకటించారు. మెడిక్యూర్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటి హాస్పిటల్‌లో మోడల్‌ పరీక్షకు సంబంధించినపోస్టర్‌ ప్రముఖ వైద్యులు డాక్టర్‌ పి.శ్రీనాథ్‌ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రీనాథ్‌ మాట్లాడుతూ డివైఎఫ్‌ఐ యువత సంక్షేమంతో పాటు సమాజ శ్రేయస్సుకు కృషి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. యువజన సమస్యలకోసం, నిరుద్యోగుల సమస్యలపై ఉద్యమాలు చేపట్టం అభినందనీయమన్నారు. డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కెఎఫ్‌.బాబు మాట్లాడుతూ యువతీ, యువకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతంఆందోళన, పోరాటాలు నిర్వమిస్తున్నటుల తెలిపారు. వేసవిలో చలివేంద్రాలు, బాలలకు సమ్మర్‌ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నీట్‌ పరీక్షకు ప్రిపేరయ్యే వారికి,పబ్లిక్‌ పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టడానికి మెడల్‌ పరీక్షతెలిపారు.ఈ నెల 20న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకూ మోడల్‌ టెస్టు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోడల్‌ టెస్టు 1,2,3, ర్యాంకులు సాధించిన వారిని ప్రోత్సహించేందుకు అభినందన సభలో బహమతులు అంద జేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నగర నాయకులు టి.భాను, బి. హేమంత్‌, టి. సుశాంత్‌, ఎస్‌కె. హిదాయత్‌, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు

➡️