పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు పట్టణంలోని జీవీఎస్వి ఆర్‌ఎం మున్సిపల్ పాఠశాల హెచ్ ఎం రాయపూడి భవాని శంకర ప్రసాద్ కు 2025 సంవత్సరానికిగాను నేతాజీ స్మఅతి పురస్కారం లభించింది. బుధవారం ఈ పురస్కారాన్ని ఉత్తమ ఉపాధ్యాయుడు రాయపూడి అందుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను రాయపూడి పాత్రికేయులకు తెలిపారు. విద్యాబోధనలో విభిన్న, వినూత్న పద్ధతుల ద్వారా విద్యార్థులకు ఉత్తమ విద్యా బోధన అందిస్తున్నందుకు, వారికి అవసరమైన మౌలిక వసతుల కల్పన, ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నందుకు తనకు ఈ పురస్కారం లభించిందని రాయపూడి తెలిపారు. నేతాజీ పురస్కారం లభించడం పూర్వజన్మ సుకఅతంగా భావిస్తున్నానని, ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని భవాని ప్రసాద్ అన్నారు. భవిష్యత్తులో పాఠశాల విద్యార్థుల విద్యాబోధన వసతుల కల్పన, పౌష్టికాహారం తదితర విషయాల్లో మరింత శ్రద్ధ వహించి మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పారు. పాఠశాల విద్యార్థులను తన సొంత బిడ్డలుగా భావిస్తానని, విద్యార్థులు పౌష్టికాహారం తిని ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి విద్యను అభ్యసించగలుగుతారని చెప్పారు. నేతాజీ పురస్కారం తనకు లభించడం ఆనందంగా ఉందని అన్నారు. పురస్కారం అందుకున్న రాయపూడి భవాని ప్రసాద్ ను, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పాఠశాలకు ప్రతి సంవత్సరం విరాళాలు ఇచ్చే దాతలైన పాటపళ్ళ నాగ దుర్గ వర ప్రసాద్, ప్రముఖ పారిశ్రామికవేత్త నడపన జగపతి, మానవతావాది కామిశెట్టి అయ్యప్ప నాయుడు, పలువురు పట్టణ ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు.
మున్సిపల్ స్కూల్ హెచ్‌ఎం భవాని ప్రసాద్ కు నేతాజీ పురస్కారం
