నేడు జూపార్కుకు కొత్త నేస్తాలు రాక

విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల

ప్రజాశక్తి – ఆరిలోవ : గుజరాత్‌లోని జమ్నాగర్‌ గ్రీన్స్‌ జులాజికల్‌ రెస్క్యూ అండ్‌ రీహెబిటేషన్‌ సెంటర్‌, రాధాకృష్ణా టెంపుల్‌ ఎలిఫెంట్‌ వెల్ఫేర్‌ ట్రస్టుల మధ్య కుదిరిన జంతు మార్పిడి ఒప్పందం ద్వారా విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు బుధవారం కొత్త జంతువులు, పక్షులు రానున్నట్టు జూ క్యూరేటర్‌ జి.మంగమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ జూ పార్కుకు స్ట్రిప్డ్‌ హైనాలు రెండు, హాగ్‌ డీర్‌ ఒక జత, పెయింటెడ్‌ స్టార్క్‌, గ్రే పెలికాన్‌, స్టార్‌ తాబేళ్లు, ఘరియాల్‌, జంగిల్‌ క్యాట్స్‌, ఢోలే, తోడేళ్ళు, గార్‌లు రానున్నట్టు తెలిపారు. విశాఖ జూపార్కు నుంచి కామన్‌ మార్మోసెట్‌, స్కార్లెట్‌ మాక్వా, గ్రీన్‌ వింగ్డ్‌ మాక్వా, మీడియం సల్ఫర్‌ కాక్టూ, స్క్వారెల్‌ మంకీస్‌, స్లెండర్‌ టైల్డ్‌ మీర్‌ కాట్‌, రెడ్‌ నెక్డ్‌ వాల్బేలు గుజరాత్‌ జూపార్కుకు తీసుకువెళతారన్నారు.

విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల

➡️