9 మంది గంజాయి విక్రేతలు అరెస్టు

Mar 18,2025 00:19

ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ : గంజాయి విక్రయిస్తున్న 9 మందిని మంగళగిరి రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. ఈ మేరకు వివరాలను మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్లో రూరల్‌ సిఐ వై.శ్రీనివాసరావు, ఎస్‌ఐ చిరుమామిళ్ల వెంకట్‌ సోమవారం వెల్లడించారు. కాజా గ్రామానికి చెందిన యువకులు కొంతకాలంగా గంజాయి విక్రయి స్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి నిఘా ఉంచారు. కాజా గ్రామ పరిధిలోని నంబూరు కెనాల్‌ వద్ద యువకులు గంజాయి విక్రయి స్తున్నట్లు సమాచారం అందడంతో వెళ్లి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు పరార య్యారు. పట్టుబడ్డ వారినుండి రూ.95 వేల విలువ కలిగిన కిలో 900 గ్రాముల గంజాయిని, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యుల్లో చిలకలపూడి భాను ప్రసాద్‌ అనే వ్యక్తి ఒరిస్సా రాష్ట్రంలోని ఇచ్ఛాపురం కొండ ప్రాంతాలకు వెళ్లి అక్కడ నుంచి గంజాయిని తెచ్చి 20 గ్రాముల చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి కొందరితో కలసి గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపారు. నిందితుల్లో కొంతమందిపై ఇప్పటికే కేసులున్నాయని, పట్టుబడ్డ అందర్నీ రిమాండ్‌కు పంపుతామని తెలిపారు. గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని, వరుసగా మూడు కేసులు నమోదైతే పీడీ యక్ట్‌ కింద నమోదు చేస్తామని మంగళగిరి హెచ్చరించారు. కార్యక్రమంలో డి.శ్యామ్‌, సిహెచ్‌ శేఖర్‌బాబు, చలమారావు, సాగర్‌ బాబు, రాము, వేమన్న కుమార్‌, సురేష్‌ పాల్గొన్నారు.

➡️