నంద్యాల అర్బన్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని …. నంద్యాల పట్టణం సంజీవనగర్ గేట్ వద్ద ఉన్న శ్రీ కోదండ రామాలయ మందిరం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండి ఫిరోజ్ గారు పాల్గొన్నారు. అనంతరం పట్టణ ముఖ్య విధుల్లో అంగరంగా వైభవంగా నిర్వహించిన రధోస్తావాన్ని టెంకాయ కొట్టి ప్రారంభించి రధాన్ని లాగడం జరిగింది. ఈ సందర్బంగా ఎన్‌ఎండి ఫిరోజ్ గారు మాట్లాడుతూ … నంద్యాల జిల్లా ప్రజాలందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపి నంద్యాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వెల్లివిరియాలని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో భగవత్ సేవా సమాజ్ అధ్యక్షులు సముద్రాల సూరయ్య , సెక్రటరీ మధుసూదన్ రావు , డి శ్రీనివాసులు , మాగం గురు ప్రసాద్ , గుడివాడి వసంత రాఘవ , నేరెళ్ల అశోక్ , ఉప్పరి సురేష్ కుమార్ మరియు శ్రీ కోదండ రామాలయం పూజారులు, ఆలయ కమిటీ నాయకులు సభ్యులు మరియు వందలాది సంఖ్యలో నంద్యాల భక్తులు పాల్గొన్నారు.
